- ఆర్థికశాఖ అధికారుల హామీ
- ఎన్ జీ వో సంఘం నేత చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి
నవంబరు జీతాలు డిసెంబర్ ఒకటిన ఇవ్వడానికి ఆర్థికశాఖ అధికారులు అంగీకరించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్ జీ వో సంఘం అధ్యక్షులు ఎన్. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆర్థికశాఖ కార్యదర్శి, సీఎఫ్ఎంఎస్ సీఈవోలను కలిసి మాట్లాడినట్లు ఆయన శనివారం రాత్రి తెలిపారు. హెచ్ ఆర్ డేటా నమోదుకు, జీతాలకు సంబంధం లేకుండా చూస్తున్నామని వారు చెప్పినట్లు వెల్లడించారు. జీతాల బిల్లులు సమర్పించేందుకు ఏర్పాటు చేశామని వారు చెప్పినట్లు తెలిపారు.
ఇది మా విజయం
- ఏపీ జీఈఏ నేతలు సూర్యనారాయణ, ఆస్కార్‌రావు
ఉద్యోగులకు ఒకటో తారీకున జీతాలు రాకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించినందువల్లే ఆర్థికశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు సూర్యనారాయణ, ఆస్కార్ రావులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం హెచ్ ఆర్ డేటా నమోదు పూర్తి చేస్తున్నారని, జీతాల బిల్లులకు సమర్పించేందుకు ఏర్పాట్లు చేశారని తెలిపారు. జీతాలు చెల్లించేందుకు హెచ్ ఆర్ డేటా నిబంధన తొలగించారని వారు తెలిపారు. ఇది తమ సంఘం విజయమని పేర్కొన్నారు. ఆర్థికశాఖ అధికారులకు, ఆర్ధికశాఖమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు