- అక్రమాలను తోడుతున్న అధికారులు
- దరఖాస్తు చేసినవారికి పిలుపులు
- ఓ సంఘం నాయకుడి దరఖాస్తు తిరస్కరణ, చార్జస్ ఫ్రేమ్
అనంతపురం విద్య, నవంబరు 28: కొందరు ఉపాధ్యాయులు, సంఘాల నాయకుల బది‘లీలలు’కు బ్రేక్ వేసేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు సిద్ధమయ్యారు. బదిలీల్లో ప్రిఫరెన్సియల్, స్పౌజ్‌ను వినియోగించుకునేందుకు అడ్డదారు లు తొక్కిన పలువురు సంఘాల నాయకులు, ఉపాధ్యాయులపై శనివారం ‘టీచర్ల బది‘లీలలు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించిన విషయం విదితమే. దీనిని జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ సీరియ్‌సగా తీసుకున్నారు. వెంటనే విచారణ చేయాలంటూ అధికారులను ఆదేశించారు. దీంతో కూడేరు, బుక్కరాయసముద్రం తదితర మండలాల్లో ప్రిఫరెన్సియల్, స్పౌజ్ పాయింట్ల కోసం అక్రమ మార్గాలు తొక్కిన వారి దరఖాస్తులను బయటకు తీసి, పరిశీలించారు. బుక్కరాయసముద్రంలోని ఓ ఉపాధ్యాయుడికి చెందిన స్పౌజ్ సర్టిఫికెట్‌కు సంబంధించిన వారిని ఆదివారం స్వయంగా వచ్చి, వివరాలు తెలపాలంటూ విద్యాశాఖాధికారాలు ఆదేశించారు. ఓ సంఘం ప్రధానకార్యదర్శి స్పౌజ్‌కు సంబంధించిగతంలో సమర్పించిన సర్టిఫికెట్లను క్షుణ్ణంగా మరోసారి పరిశీలించారు. బోగస్ సర్టిఫికెట్లు, ఉత్తర్వు కాపీలు చూపి, తప్పుదోవ పట్టించారని నిర్ధారణకు వచ్చిన అధికారులు.. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమయ్యారు. దీనిపై రాత్రి డీఈఓ శామ్యూల్ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ఆ నాయకుడు తన భార్య (స్పౌజ్) అనంతపురంలో పనిచేస్తున్నట్లు దరఖాస్తులో ఇచ్చాడన్నారు. ఆయన దరఖాస్తును తిరస్కరించామన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు చార్జస్ ఫ్రేం చేశామన్నారు. జీవోకు విరుద్ధంగా ఉన్న, ఎంఐ కేటగిరీకి చెందిన మరో 49 దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిపారు.
We want manual councilling
పూర్తి స్టేషన్ పాయింట్స్ HM లకు కూడా ఇస్తారా?