- డెమో సంగతి మరిచారు
- సర్వీసు పాయింట్ల పెంపు
న్యూస్ టోన్, మచిలీపట్నం : టీచర్ల బదిలీల షెడ్యూలును డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బుధవారం విడుదల చేసింది గతంలో విడుదల చేసిన జీవో నెంబరు 50, 54, 59ల ఆధారంగా ఈ షెడ్యూలును ఖరారు చేశారు టీచర్ల బదిలీల ఉత్తర్వులు జారీ చేయడం ఇది మూడోసారి. బదిలీ కోసం ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈనెల 16న ముగిసింది. 2017వ సంవత్సరం నుంచి టీచర్ల బదిలీలు జరగలేదు అయినప్పటికీ ఎనిమిది సంవత్సరాల కంటే అధికంగా ఒకే పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు పాయింట్లు ఎనిమిది సంవత్సరాలకే పరిమితం చేశారు. సర్వీసు పాయింట్లు 30 సంవత్సరాలకు పరిమితం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం తెలపడంతో ఎనిమిది సంవత్సరాల కంటేఅధికంగా ఒకే పాఠశాలలో పనిచేసిన టీచర్లకు పాయింట్లు ఎనిమిది సంవత్సరాలకే పరిమితం చేశారు. సర్వీసు పాయింట్లు 30 సంవత్సరాలకు పరిమితం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం తెలపడంతో ఎనిమిది సంవత్సరాల కంటే అధికంగా ఎన్ని సంవత్సరాలు పని చేస్తే అన్ని సంవత్సరాలకు పాయింట్లు కేటాయించేందుకు అంగీకరించి అందుకనుగుణంగా మార్పులు చేసి, తాజా ఉత్తర్వులు జారీ చేశారు వెబ్ కౌన్సెలింగ్ పద్ధతిలో జరిగే ఈ బదిలీ షెడ్యూలు వివరాలు ఇలా ఉన్నాయి
28నుంచి ప్రక్రియ ప్రారంభం
టీచర్ల ఆన్లైన్ దరఖాస్తులను 28, 29 తేదీల్లో పరిశీలిస్తారు. 30 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు పాయింట్ల ఆధారంగా సీనియారిటీ జాబితాలను తయారు చేస్తారు. డిసెంబరు 3, 4 తేదీల్లో అభ్యంతరాలను వెబ్ సైట్ లో తెలియజేసేందుకు అవకాశం ఇచ్చారు. అభ్యంతరాలుంటే అందుకు సంబంధించిన సాక్ష్యాలను డీఈవోకు సమర్పించాలి. డిసెంబరు 5-7 మధ్య అభ్యంతరాలను పరిశీలించి, డీఈవో, జాయింట్ కలెక్టర్ (డెవలప్మెంట్) సమాధానాలు ఇస్తారు. 10వ తేదీలోగా తుది సీనియారిటీ జాబితాలను పాయింట్ల ఆధారంగా ప్రకటిస్తారు. 11 నుంచి 15వ తేదీ వరకు టీచర్లు ఆన్ లైన్ లో వెబ్ ఆప్షన్ పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు. 16 నుంచి 21 వరకు కేటాయించిన పాఠశాలల జాబితాలను ప్రకటిస్తారు. 22, 23 తేదీల్లో ఈ జాబితాలను పరిశీలించి, లోపాలుంటే సరిదిద్దుతారు. డిసెంబరు 24న బదిలీ అయిన టీచర్లు ఉత్తర్వులను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
డెమో సంగతి మరిచారు
ఇటీవల విద్యాశాఖ మంత్రి, అధికారులతో జరిగిన చర్చలో మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రతిపాదన చేశారు. వెబ్ కౌన్సెలింగ్ పై డెమో ఇస్తామని, అందులో లోపాలుంటే మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేస్తామని నాడు ఉన్నతాధికారులు చెప్పారని, అయితే తాజా షెడ్యూలులో డెమో అంశాన్ని ప్రస్తావించలేదని తెలిపారు.