- దాదాపు అన్ని ప్రాతినిధ్యాలకు నో
- ప్రాతినిధ్యం చేసేటపుడు సరైన భాష ఉపయోగించాలని హితవు
అమరావతి: బదిలీలకు సంబంధించి ఫ్యాప్టో తరపున ఇచ్చిన అన్ని దాదాపు ప్రాతినిధ్యాలకు విద్యాశాఖ కమీషనర్ నో చెప్పారు. ఇప్పటికే షెడ్యూల్ ఇచ్చి క్రమ బద్దీకరణ కసరత్తు పూర్తి అయినందున ఎలాంటి మార్పులు ఉండబోవు అని ప్రతి లేఖ గా ఉత్తర్వుల రూపం లో తెలియ చేశారు. ఫ్యాప్టో కొన్ని సందర్భాలలో వారు ఉపయోగిస్తున్న భాష సరిగా ఉండడం లేదనీ, ఆ విధమైన భాషా ప్రయోగం మానుకోవాలని ఘాటు గా బదులు ఇచ్చారు. ప్రాతినిధ్యం చేసేటపుడు సరైన భాష ఉపయోగించాలని హితవు పలికారు. వెబ్ కౌంసిలింగ్ డెమో ని ప్రదర్శిస్తామనీ, త్వరలోనే తేదీ, సమయం తెలియ చేస్తామని తెలిపారు.