ఉపాధ్యాయులు ఎన్నో రోజులు గా ఎదురు చూస్తున్న బదిలీల జీవో నెం. 54 తేదీ 12/10/2020 ను ఈ రోజు విద్యా శాఖ కార్యదర్శి శ్రీ బుడితి రాజ శేఖర్ విడుదల చేశారు. క్రమ బద్దీకరణ నిబంధనలు వేరే జీవో లో ఉంటాయి.
ఈ క్రింది లింక్ నుండి జీవో ను డౌన్లోడ్ చేయండి.
[post_ads]
ఉపాధ్యాయుల సాధారణ బదిలీల నియమ నిబంధనలు – తెలుగు లో
ప్రభుత్వ, పంచాయితీ రాజ్ పాఠశాలలలోని ఉపాధ్యాయుల సాధారణ బదిలీలకు సంబధించి ఈరోజు (12/10/2020) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బి.రాజశేఖర్ ఉత్తర్వులు 54 విడుదల చేశారు.
ఈ ఉత్తర్వులకు సంబంధించి పాఠశాల విద్యా సంచాలకులు అవసరమైన వివరణలు ఇవ్వడానికి, సరి అయిన రీతిలో అమలు చేయడానికి అధీకృత అధికారి. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ కూడా ఆయా యాజమాన్యాలలో పనిచేసే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వవచ్చు. డైట్ ల యందు, సమగ్ర శిక్షాభియాన్ నందు కూడా బదిలీలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మార్గదర్శకాలు : – ఈ బదిలీ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయి. ఇవి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ తత్సమాన మరియ యస్.జి.టి. తత్సమాన కేడర్లకు వర్తిస్తాయి.
2019-2020 విద్యా సం. ఆఖరి పని దినం నాటికి టీచర్లు 8 అకడమిక్ సం.లు, జిహెచ్.యం.లు ఐదు అకడమిక్ సం.లు పూర్తి చేసుకుంటే గరిష్ట సర్వీసుగా భావించి తప్పనిసరి బదిలీ చేస్తారు.
సగం కంటే ఎక్కువగా గల అకడమిక్ సంవత్సరాన్ని కూడా పూర్తి అకడమిక్ సం.గా పరిగణిస్తారు.
టీచర్లు 18/11/2012, జిహెచ్.యం.లు 18/11/2015 కంటే ముందు కనుక పాఠశాలలో చేరితే వారికి గరిష్ట సర్వీసు అయినట్లు.
2 సం.ల లోపు సర్వీస్ 01 అక్టోబర్ నాటికి ఉన్నట్లయితే వారిని 8/5 సం.లు పూర్తి అయినా తప్పని సరి బదిలీ చేయరు. రిక్వెస్ట్ బదిలీ కోరవచ్చు.
బాలికోన్నత పాఠశాలలలో 01 అక్టోబర్ నాటికి 50 సం.లు లోపు ఉన్న పురుష ఉపాధ్యాయులను తప్పనిసరి బదిలీ చేస్తారు.
బాలికోన్నత పాఠశాలలలో పనిచేయడానికి మహిళా ఉపాధ్యాయులు అందుబాటులో లేనట్లయితే 50సం.లు పైబడిన పురుష ఉపాధ్యాయులను ఆయా పాఠశాలలకు బదిలీ కోరుకోవడానికి అనుమతిస్తారు.
01 అక్టోబర్ నాటికి పాఠశాలలో 2 సం.లు సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులకు రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చును.
ఒక పాఠశాలలో ఒక పోస్ట్ సర్ ప్లస్ అయితే అక్కడ 8సం. లాంగ్ స్టాండింగ్ అయిన ఉపాధ్యాయుని ఎఫెక్ట్ చేయాలి.
సర్ ప్లస్ అయిన పాఠశాలలో 8 సం. లాంగ్ స్టాండింగ్ లేకపోతే జూనియర్ మోస్ట్ టీచర్ ఎఫెక్ట్ అవుతారు. సీనియర్ విల్లింగ్ ఇస్తే వారిని ఎఫెక్ట్ చేస్తారు.
ఎన్.సీ.సి/స్కౌట్స్ స్కూల్స్ లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు గరిష్ట సర్వీస్ పూర్తి అయిన సందర్భంలో ఆ యూనిట్ ఉన్న చోటనే బదిలీ కోరుకోవాలి. ఒక వేళ ఖాళీ లేనట్లయితే పూర్వపు పాఠశాలలో కొనసాగవచ్చు.
ఉర్చూ, తమిళ్, కన్నడ, ఒరియా, భాషలను చదివిన జిహెచ్.యం.లు ఉన్నట్లయితే వారికి ఆయా పాఠశాలలను కోరుకొనడానికి ప్రాధాన్యత ఇస్తారు.
8/5 అకడమిక్ సం.లు గరిష్ట సర్వీస్ గుర్తించడానికి పాఠశాలను క్రైటీరియాగా తీసుకుంటారు.
విజువల్ చాలెంజ్ రిక్వెస్ట్ బదిలీ కోరుకొనకపోతే బదిలీలు వర్తించవు.
బదిలీ ఉపాధ్యాయుడు ప్రస్తుతం పనిచేస్తున్న యాజమాన్యం పరిధిలోనే జరుగుతుంది.
స్వంత యాజమాన్య పాఠశాలకు బదిలీ కోరుకుంటే అక్కడ ఖాళీ ఉన్నట్లయితే సీనియారిటీ ప్రాతిపదికన బదిలీ చేస్తారు.
ఏజన్సీలో పనిచేస్తున్న లోకల్ ట్రైబ్ టీచర్లను ప్లెయిన్ ఏరియాకు బదిలీ చేయరు. నాన్ ట్రైబ్ టీచర్లు ప్లెయిన్ నుండి ఏజన్సీకి, ఏజన్సీ నుండి ప్లెయిన్ కి బదిలీ కోరవచ్చు.
అయితే ఏజన్సీలో పనిచేస్తున్న నాన్ ట్రైబ్ టీచర్లు ప్లెయిన్ ఏరియాకు బదిలీ జరిగితే ప్రత్యామ్నాయ టీచర్ వారి స్థానంలో వస్తేనే రిలీవ్ చేస్తారు.
ఏజన్సీలో ఖాళీ పోస్టులను భర్తీ చేయరు. ప్లెయిన్ ఏరియాలో సర్ ప్లస్ జూనియర్ టీచర్లను డిప్యుటేషన్ వేస్తారు.
బదిలీల షెడ్యూల్ పాఠశాల విద్యా సంచాలకులు వారు విడుదల చేస్తారు.
బదిలీల ప్రక్రియ ఆన్ లైన్ ద్వారా జరుగుతుంది.
నియామకాధికారి వారు బదిలీ ఉత్తర్వులను ఇవ్వడానికి అధీకృత అధికారి.
సర్వీస్ పాయింట్లు : –
క్యాటగిరీ IV లో పనిచేసిన ప్రతి సం. కాలానికి 5, క్యాటగిరీ III లో పనిచేసిన ప్రతి సం. కాలానికి 3, క్యాటగిరీ ॥ లో పనిచేసిన ప్రతి సం.కాలానికి 2, క్యాటగిరీ | లో పనిచేసిన ప్రతి సం. కాలానికి 1 పాయింట్ చొప్పున మంజూరు చేస్తారు. అయితే ఈ పాయింట్లు గరిష్టంగా 40 దాటి ఇవ్వరు.
క్యాటగిరీ I – 20% ఇంటి అద్దె పొందే ప్రాంతాలు ; క్యాటగిరీ ॥| – 14.5% ఇంటి అద్దె పొందే ప్రాంతాలు ; క్యాటగిరీ III – 12% ఇంటి
అద్దె పొందే ప్రాంతాలు ; క్యాటగిరీ / – 12% ఇంటి అద్దె పొందే ప్రాంతాలలో పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ వారి ప్రకారం అన్ని వాతావరణాలలోను రోడ్డు సదుపాయం లేనివి.
ఉపాధ్యాయుల పనిచేసే పాఠశాల బదిలీ పీరియడ్ నందు వేర్వేరు క్యాటగిరీలు ఉన్నచో పాయింట్లు తదనుగుణంగా మంజూరు చేస్తారు.
జిల్లా స్థాయి కమిటీ క్యాటగిరీ / జాబితా గతానిది, ఇప్పటిది అనుసరించి పాయింట్లు ఇవ్వాలి. తాజా క్యాటగిరీ |1/ జాబితాను పాయింట్ లెక్కించడానికి అధీకృతం చేయాలి. ఈ విషయంలో కమిటీ నిర్ణయమే ఫైనల్.
అక్టోబర్ 01 వ తేదీ నాటికి పూర్తి చేసిన సర్వీసులో ప్రతి సం.నికి 0.5 చొప్పున పాయింట్లు కేటాయిస్తారు. గరిష్టంగా 15 పాయింట్ మాత్రమే.
మొత్తం ఎన్ టైటిల్ పాయింట్లు 55 మించకూడదు.
స్పెషల్ పాయింట్లు :–
అవివాహిత అయిన టీచర్ / జిహెచ్.యం. కి – 5 పాయింట్లు ; స్పాస్ పాయింట్లు – 5 ; విభిన్న ప్రతిభావంతులకు (40 10 55%) -5 పాయింట్లు ; విభిన్న ప్రతిభావంతులకు (56 10 69%) – 10 పాయింట్లు ; గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా/రాష్ట
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు — 5 పాయింట్లు ; మొత్తం స్పెషల్ పాయింట్లు – 25 ;
రేషనలైజేషన్ నందు ఎఫెక్ట్ అయిన టీచర్లకు – 5 పాయింట్లు; 8/5 గరిష్ట సర్వీస్ పూర్తి చేసిన వారికి వర్తించదు. బదిలీకి దరఖాస్తు చేసుకొనని రేషనలైజేషన్ ఎఫెక్టెడ్ టీచర్లకు క్యాటగిరీ ॥, / పాఠశాలలను కేటాయింపు జరుగుతుంది.
ఒక వేళ పాయింట్లు సమానమైతే క్యాడర్ నందు సీనియారిటీని తొలుత పరిగణనలోనికి తీసుకుంటారు. అపుడు కూడా సమానమైన వేళ పుట్టిన తేదీ ఆధారంగా సీనియర్ ను గుర్తిస్తారు. చివరిగా మహిళకు ప్రాధాన్యతను ఇస్తారు.
70% పైబడిన విభిన్న ప్రతిభావంతులు , విడో , విడాకులు పొందిన మహిళలు, క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, బోన్ టిబి, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్, డయాలసిస్, స్పెనల్ సర్జరీ చేయించుకున్న ఉపాధ్యాయులు, మెంటల్లీ రిటార్టెడ్ అయిన తల్లి, తండ్రి, పిల్లలు, స్వౌస్ ఉన్న ఉపాధ్యాయులు, గుండెలో హోల్, జువైనల్ డయాబిటీస్, తలసేమియా, హెమోఫోలియా, మస్కులర్ డిస్త్రఫీ జబ్బులతో బాధపడే పిల్లలు ఉన్న ఉపాధ్యాయులు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బియస్.ఎఫ్. సి.ఆర్.పి.ఎఫ్, సి.ఐ.యస్.ఎఫ్.లకు సంబంధించి సర్వీస్ పర్సన్ లేక ఎక్స్ సర్వీస్ పర్సన్ స్పౌస్ అయిన ఉపాధ్యాయులు
సేవా పుస్తకంలో ఎంట్రీ ఉండి పిహెచ్ కోటాలో ఎంపికైన విభిన్న ప్రతిభావంతులు ఎటువంటి ధృవపత్రాలు సమర్పించనక్కరలేదు.
పిల్లలు జబ్బులతో బాధపడుతూ ప్రిఫరెన్నియల్ క్యాటగిరీ నందు దరఖాస్తు చేసే ఉపాధ్యాయులు సంబంధిత మెడికల్ రిపోర్టుల జాయింట్ కలెక్టర్ వారికి సబ్మిట్ చేయాలి.
ప్రిఫరెన్నియల్ క్యాటగిరీ లేక స్పెషల్ పాయింట్లు 8/5లకు ఒకసారి మాత్రమే వర్తిస్తాయి. రేషనలైజేషన్ నందు ఎఫెక్ట్ అయిన టీచర్ల కు మాత్రం 8/5 సం.ల నిబంధన వర్తించదు. వారికి రేషనలైజేషన్ పాయింట్లు కూడా ఇస్తారు
ఖాళీలు :-
క్లియర్ వేకెన్సీస్ , తప్పని సరి బదిలీ వల్ల ఏర్పడిన ఖాళీలు , ఎరైజింగ్ వేకెన్సీస్ , ఒక సం. దాటి అనధికార గైర్హాజరు అయిన
ఉపాధ్యాయుల ఖాళీలు ; నాలుగు వారాలు దాటిన మెడికల్ లీవ్, ప్రసూతి శలవు లో ఏర్పడిన ఖాళీలలో వర్క్ ఎడ్డస్ట్ మెంట్ చేయాలి కాని ఖాళీలుగా నోటిఫై చేయకూడదు. ప్రతి క్యాడర్ నందు మంజూరైన పోస్టులు, ఏర్పడిన ఖాళీలను లెక్కించాలి. తేడా ఉన్న ఖాళీలు ఎన్ని ఉన్నాయో అదే సంఖ్యలో బ్లాక్ చేయాలి. 01-10-2020 నాటి యు-డైస్ లెక్కలు ఆధారంగా ఖాళీలను లెక్కిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలలలో స్కూల్ అసిస్టెంట్ గణితం, భౌతిక శాస్త్రం ఖాళీలను స్పెసిఫై చేయాలి.
ఖాళీలు – సీనియారిటీ లిస్ట్ – ఆర్.జె.డి. డి.ఇ.బ. వెబ్ సైట్ల యందు క్యాటగిరీ వారీగా పాఠశాలల జాబితాలు, పాఠశాలల వారీగా ఖాళీల జాబితా, తప్పని సరి బదిలీ అయిన టీచర్ల జాబితా, రేషనలైజేషన్ ఎఫెక్ట్ అయిన టీచర్ల జాబితా, దరఖాస్తు తేదీ ముగిసిన తరువాత క్యాడర్ వారీ ఎన్ టైటిల్ పాయింట్లతో కూడిన సీనియారిటీ లిస్ట్ ఉంచాలి.
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు : – https://cse.ap.gov.in నందు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తుల ను స్వీకరిస్తారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసిన తరువాత ప్రింట్ జెట్ తీసి సంబంధిత అధికారులకు వెరిఫికేషన్ నిమిత్తం సబ్మిట్ చేయాలి.
‘ప్రిఫరెన్నియల్ క్యాటగిరీ మరియు స్పాస్ క్యాటగిరీ వారు ఆన్ లైన్ దరఖాస్తుతో సంబంధిత ధృవపత్రాన్ని కూడా ఎన్ క్లోజ్ చేయాలి. ఆన్ లైన్ నందు ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేయాలి. ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ డిస్ ప్లే చేయాలి. ఫిర్యాదులు స్వీకరించాలి. తప్పని సరి బదిలీ అయినవారు అన్ని ఆప్పన్లు ఇవ్వాలి. తప్పని సరి బదిలీ అయిన వారు దరఖాస్తు చేయకపోయినా, ఆప్పన్లు పెట్టక పోయినా చర్యలు సంబంధిన్చి, ఉపాధ్యాయుల మీదా, అలాగే సంబంధిత అధికారుల మీదా చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి క్యాటగిరీ III & IV లో ఉన్న ఖాళీలలో పోస్టింగ్ ఇస్తారు.
విద్యా సంచాలకులు ఫిర్యాదులను ఆన్ లైన్ / మేన్యువల్ గా పరిష్కరించి వెబ్ సైట్ నందు సీనియారిటీ లిస్ట్ ఉంచాలి.
కౌన్సిలింగ్ :- ఆన్ లైన్ వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది.
బదిలీ ఉత్తర్వులు :- సంబంధిత అధికారులు బదిలీ ఉత్తర్వులు ఇస్తారు.
బదిలీ అయిన ఉపాధ్యాయుల రిలీవింగ్ :– ఉత్తర్వులు అందిన తరువాతి రోజు నుండి 7 రోజుల లోపు విధులలో చేరాలి. ఒక పాఠశాలలో బదిలీ అయిన ఉపాధ్యాయులలో 50% ఉపాధ్యాయులను మాత్రమే ప్రత్యామ్నాయం లేకుండా రిలీవ్ చేస్తారు. బక పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నచో ప్రత్యామ్నాయం లేకుండా రిలీవ్ చేయరు. ఇరువురు ఉపాధ్యాయులకు బదిలీ జరిగినట్లయితే ఒకరిని అందులో సీనియర్ ని రిలీవ్ చేస్తారు.
ముగ్గురు ఉపాధ్యాయులకు బదిలీ జరిగినట్లయితే ఒకరిని అందులో సీనియర్ ని రిలీవ్ చేస్తారు.
అప్పీల్ :- టీచర్ల బదిలీ ఉత్తర్వులపై గ్రీవియన్స్ ఉన్నట్లయితే ఆర్.జె.డి. వారికి, జిహెచ్.యం.లకు గ్రీవియన్స్ ఉన్నట్లయితే కమీషనర్ వారికి ఉత్తర్వులు అందిన 10రోజుల లోపు ఫిర్యాదు చేసుకోవాలి. వారు సదరు అప్పీల్స్ ను 15 రోజుల లోపు క్లియర్ చేయాలి.
రివిజన్ :- పాఠశాల విద్యా సంచాలకులు నాలుగు వారాల లోపు ఏ ఉత్తర్వులనైనను సంబంధిత రికార్డులను పరిశీలించి నిలుపుదల కాని మార్పు చేయవచ్చును.
క్రమశిక్షణా చర్యలు :– తప్పుడు సమాచారం కాని, ధృవపత్రాలు కాని సమర్పించినట్లయితే సంబంధిత ఉపాధ్యాయులపైనా, సంబంధి, అధికారులపైనా సిసిఎ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకొనబడును. నియమ నిబంధనలు ఉల్లంఘించి ఉత్తర్వులు ఇచ్చినట్లయితే కమిటీలో ఉన్న మెంబర్ సెక్రటరీ కూడా శిక్షార్పుడే. బదిలీ ఉత్తర్వులు విడుదలై, ఫిర్యాదులు గడువు కూడా ముగిసిన పిదప నూతన స్థానంలో చేరనట్లయితే సదరు ఉపాధ్యాయులకు నో వర్క్ నో పే వర్తింపు చేస్తారు.