Wednesday, November 20, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
Day-1 1st May We Love Reading...

AP : November 2024 Session Department Tests

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబర్ 2024 సెక్షన్ సెషన్ లో...

APTET July 2024 Rsults out now. Check result on this direct link

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ జులై-2024) ఫలితాలను ఈ...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

How to check School Grant balance in PFMS login

Andhra Pradesh school education department sanctioned an amount of...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

Day-1 1st May We Love Reading Story-1 గోవిందయ్య మంచితనం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

 Day-1 1st May We Love Reading Story-1 గోవిందయ్య మంచితనం . This story is a part of the We Love Reading Series for Students, who enjoy reading during Summer Vacation 2023.

గోవిందయ్య మంచితనం 

రామాపురం.. రాజధాని నగరానికి సమీపంలో ఉండే గ్రామం. నది ఒడ్డునే ఉండటంతో ఎప్పుడూ పచ్చని పైర్లతో కళకళలాడుతుండేది. పంటల దిగుబడులకు తగినట్లు, ఆ ఊర్లో ధాన్యం వ్యాపారులూ ఎక్కువే. రైతుల నుంచి ధాన్యాన్ని కొని, రాజధానిలో మంచి ధరకు విక్రయించి లాభాలు గడించేవారు. ఆ ఊళ్లో గోవిందయ్య, మాధవయ్య, శేఖరయ్య కాస్త పెద్ద వ్యాపారులు, తన సంపాదనలో కొంత దానధర్మాలకు ఖర్చు చేయడం గోవిందయ్యకు అలవాటు. మాధవయ్య, శేఖరయ్యలు మాత్రం అవేమీ పట్టించుకునేవారు. కాదు. వచ్చిన సొమ్మునంతా గల్లా పెట్టెల్లో భద్రపరుచుకొనేవారు. దానధర్మాల జోలికి పోయేవారు కాదు.

ఏటా వేసవిలో గ్రామం పొలిమేరలో తాటాకుల పందిరి వేసి, మట్టి కుండల్లో తాగునీటి వసతితో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసేవాడు గోవిందయ్య అలా నగరానికి రాకపోకలు సాగించేవారి దప్పికను తీర్చేవాడు. గోవిందయ్య చేసే సాయానికి ఆ ఊరి జనం అతన్ని ఎంతగానో మెచ్చుకొనేవారు.

తమ తోటి వ్యాపారి అలా ప్రజల మెప్పు పొందటం మాధవయ్య, శేఖరయ్యకు అస్సలు నచ్చేదికాదు. అలా అని వారూ మంచిపేరు. తెచ్చుకుందామంటే.. డబ్బు ఖర్చు చేయడానికి మనసు ఒప్పేదికాదు. ఇక వారు గోవిందయ్యను విమర్శించడం మొదలు పెట్టారు. ‘చలివేంద్రం పెట్టడం గొప్పనా? అంత సంపాదిస్తూ నీళ్లు పోసి మంచిపేరు సంపాదిస్తున్నాడు. చల్లటి మజ్జిగ ఇస్తూ బాటసారుల దాహం తీర్చొచ్చు కదా? అంటూ వెటకారంగా మాట్లాడుతూ హేళన చేసేవారు. ఇది విన్న జనాలు.. వారి ఎదుట ఏం అనకపోయినా వెనకాల మాత్రం మజ్జిగ ఏదో వీళ్లే ఇవ్వొచ్చు కదా?’ అని మాట్లాడుకునేవారు. ఆ నోటా ఈ నోటా ఆ ఇద్దరి విమర్శలు గోవిందయ్యను చేరాయి. ‘అరే.. నాకీ విషయం తట్టనేలేదే..’ అనుకున్న గోవిందయ్య మరుసటి సంవత్సరం చలివేంద్రంలో చల్లటి నీటితోపాటు మజ్జిగ కూడా ఏర్పాటు చేశాడు. 

అప్పుడు ఇక ఆ గ్రామ ప్రజల పొగడ్తలు ఇంకా ఎక్కువయ్యాయి. అవి తట్టుకోలేని మాధవయ్య,

శేఖరయ్య.. ‘అతని స్థాయికి మజ్జిగ ఇవ్వడం పెద్ద గొప్పా? కొబ్బరినీళ్లు కూడా ఇవ్వొచ్చు’ అంటూ విమర్శించసాగారు. ఎవరో మాట్లాడుకుంటుండగా.. ఆ మాటలు గోవిందయ్యకు తెలిశాయి. ఈసారి అతడి మనసు నొచ్చుకుంది. ‘నేనేమీ పొగడ్తల కోసం చలివేంద్రం పెట్టడం లేదు. అయినా ఇలా అనవసరమైన విమర్శలు చేయడం ఏంటి? 

day-1 1st may we love reading story-1 గోవిందయ్య మంచితనం

ఇక వచ్చే ఏడాది నుంచి చలివేంద్రం ఏర్పాటు చేయను’ అంటూ బాధపడ్డాడు. ఈ విషయం గోవిందయ్య తండ్రికి తెలిసింది.

తనను పిలిపించి.. ‘నువ్వు వేసవిలో బాటసారుల దాహం తీర్చాలనుకున్నావు.. తీరుస్తున్నావు. మంచిదే, నీకు తోచింది. నువ్వు చేస్తున్నావు. దాని ద్వారా తృప్తి పొందుతున్నావు. ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. చేస్తుంది మంచి పని అయినప్పుడు ఒకరు ఏమనుకుంటారోనని ఆలోచించవద్దు. ఇలాంటి విషయాల్లో విమర్శించే వారి మాటలను పట్టించుకోవద్దు. ఎంత మంచి చేసినా విమర్శించేవారు ఉంటూనే ఉంటారు. 

అవేవీ మనసులో పెట్టుకోకుండా నీ ఆశయంతో నువ్వు ముందుకు సాగిపో కొంత మంది అయినా నీ పనుల వల్ల మేలు పొందుతారు’ అంటూ హితవు చెప్పాడు. తండ్రి అనుభవంతో చెప్పిన మాటలు విన్నాక గోవిందయ్య మనసు తేలికపడింది. అప్పటి నుంచి విమర్శలను పట్టించుకోకుండా ఊరి ప్రజలకు చేతనైన సాయం చేస్తూ.. మరింత కీర్తి గడించాడు. కాలక్రమంలో మాధవయ్య, శేఖరయ్య కూడా తోటి వ్యాపారి మంచితనాన్ని, సేవా గుణాన్ని ప్రశంసించారు.

ప్రశ్నలు:

  • చలివేంద్రం ఏ కాలంలో పెడతారు. దాని వల్ల ఉపయోగం ఏమిటి ?
  • నువ్వు ఎప్పుడూ అయిన ఇతరులకు ఏదైనా సహాయం చేశావా ?
  • చలివేంద్రం లో ఏం ఏం పెడతారు ?

Picture Drawing Skill

పిల్లలు ఈ కింది బొమ్మ గీయండి

day-1 1st may we love reading story-1 గోవిందయ్య మంచితనం

English Story-1 The Ant and The Grasshopper

Once on a bright summer sunny day, a Grasshopper was singing then he saw an Ant working hard to collect food.

The grasshopper said, “Why do you work so hard in summer?

Summer is for fun, relaxation and enjoyment. Come let us sing and enjoy”.

But Ant said, “I am collecting food for the winters and I recommend you to do the same.”

Grasshopper said, “We have got plenty of food at present. Why bother about winter now?”.

The Ant ignored him and went on its way.

When the winter came grasshopper had no food to eat.

He saw that Ant and begged for food, but she said, “When I worked hard, you enjoyed”.

Then grasshopper learned his lesson the hard way.

Moral: Work hard so you can get the benefits tomorrow.

day-1 1st may we love reading story-1 గోవిందయ్య మంచితనం


day-1 1st may we love reading story-1 గోవిందయ్య మంచితనం

day-1 1st may we love reading story-1 గోవిందయ్య మంచితనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this