ప్రజాశక్తి-భీమవరం : మహిళలు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని భీమవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ పిబిఎల్ సరోజినీ సూచించారు. పట్టణంలోని 36వ వార్డు పరిధిలో రామరాజు తోట అంగన్వాడీ కేంద్రంలో మిషన్ శక్తి 100 రోజులు అవగాహన కార్యక్రమన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ సరోజిని మహిళలకు ఉన్న చట్టాలు, ఆరోగ్య సూత్రాలు, పోషకాహారంపై మహిళలకు సూచనలు సలహాలు అందజేసి మాట్లాడారు. ముఖ్యంగా బాలివివాహాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల్య వివాహాలు చేయడం ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని చెప్పారు. బాల్య వివాహాల నిరోధానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని దీనిని అధిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే నేడు సమాజంలో గృహింస రోజురోజుకి పెరుగుతుందని దీని నిరోధానికి గృహింస చట్టం ఉందని పేర్కొన్నారు. ఎవరైనా గృహహింసకు గురైతే రక్షణ పొందెందుకు అనేక అవకాశాలు ఉన్నాయని ఎవరు అధైర్యపడకుండా ఎటువంటి అగత్యాలకు పాల్పడకుండా ధైర్యంతో ముందుకు సాగలన్నారు. ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత లోపం ఎక్కువగా కనిపిస్తుందన్నారు. సరైన పోషకాహారం తీసుకుంటే రక్తహీనత దరి చేరదని చెప్పారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రభుత్వం గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తుందని దీనిని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో భీమవర ఏఎన్ఎం సులోచన అంగన్వాడీ కార్యకర్త ఎం.వెంకటేశ్వరమ్మ, ఆశా కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.