Real Estate Boom : హైదరాబాద్ నగరంలో సొంతింటి కలనుసాకారం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అద్దె ఇంట్లో ఉండలేక.., ఆ అవస్థలు పడలేక కాస్త అప్పు చేసైనా ప్రాపర్టీని కొనేందుకు కొనుగోలుదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇళ్లు లేదా ఇంటి స్థలం కొనుగోలు చేయడం లక్షల రూపాయలతో కూడిన వ్యవహారం.
దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ తక్కువ ధరకు భూమి దొరుకుతుంది…? ఎక్కడ పెట్టుబడి పెడితే ఆ సొమ్ము మంచి రిటర్న్స్ వస్తాయని ప్రజలు ఆలోచిస్తున్నారు. అంతే కాకుండా భవిష్యత్తుకు మంచి భరోసా ఉంటుందా లేదా అనే కోణంలోనూ ప్రజలు ప్లాన్ చేస్తున్నారు.
నార్త్ హైదరాబాద్‌లో అందుబాటు ధరలు :
హైదరాబాద్ వెస్ట్‌జోన్‌లో… ఔటర్ రింగ్ రోడ్డు వరకు రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది. ఔటర్‌కు సమీపంలో అనేక రెసిడెన్షియల్, కమర్షియల్ సముదాయాలు డెవలపయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న భూముల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. సికింద్రాబాద్ నుంచి శామీర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు రోడ్డు కమ్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును ఇటీవల చేపట్టింది తెలంగాణ సర్కార్. దీంతో హైదరాబాద్‌లో చక్కని మౌలిక వసతులు ఉన్న ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి గుడ్ ఆఫ్షన్ నార్త్ హైదరాబాద్ అంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్.
ప్రభుత్వం ప్రెస్టీజియస్‌గా చేపట్టిన రోడ్ కమ్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పూర్తయితే నార్త్ హైదరాబాద్‌కు మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశముందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. జీనోమ్ వ్యాలీలో ఫేజ్-2కు ప్రణాళికలు చేస్తుండటంతో కంపెనీల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
ఇక ప్రభుత్వం ఆలోచిస్తున్న ఫార్మావిలేజీలు, పారిశ్రామిక క్లస్టర్లు పెంచితే ఈ మార్గంలో శామీర్ పేట్ వరకు రియాల్టీ బూమ్ మరింత పెరిగే చాన్స్ ఉంది. ఈ ప్రాంతాల్లో విస్తారంగా గ్రీనరీ అందుబాటులో ఉండటం కూడా రియల్ ఎస్టేట్‌కు ఊతమిచ్చే చాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండటంతో ఎక్కువమంది కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.