ఇప్పుడు థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసే వాళ్లకన్నా.. ఇంట్లో అందరితో కలిసి ఓటీటీలో సినిమాలు, సిరీస్లు చూసే వాళ్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. అలాగే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సంఖ్య కూడా పెరిగిపోయింది. అందరూ ఒకటికి మించే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ మెయిన్ టైన్ చేస్తున్నారు. అయితే వాటిలో ఏం సినిమాలు చూడాలే తెలియదు. ఎలాంటి సినిమాలు చూడాలో తెలియదు. ఒక్కోసారి సినిమాలు వెతుక్కోవడానికే సగం సమయం సరిపోతుంది. అలాంటి వారి కోసం మేము సజీషన్స్ కూడా ఇస్తున్నాం. వాటికి అదనంగా ఓటీటీల్లో ఎలాంటి సినిమాలు, సిరీస్లు ఎక్కువగా చూస్తున్నారు? ఈ ఏడాదిలో ఎలాంటి సినిమాలు, సిరీస్లకు మంచి ఆదరణ లభించిందో చూద్దాం. అలా అయితే మీరు మిస్ అయిన్ బెస్ట్ కంటెంట్ ఉంటే చూసేయచ్చు.
సాధారణంగా చాలామంది ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్లు చూసేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అందుకు ఒక ప్రధాన కారణం వెబ్ సిరీస్లు ఇంట్రెసటింగ్ గా ఉండటం. అలాగే ప్రతిరోజు ఒక సినిమా కోసం టైమ్ వేస్ట్ చేసుకునే పని ఉండదు కాబట్టి. అయితే మీరు కూడా అలాంటి ఒక మైండ్ సెట్ తో ఉంటే వెబ్ సిరీస్లు, రియాలిటీ షోలను ఎంజాయ్ చేయచ్చు. ఈ టాప్ లిస్టులో ఎక్కువ మంది వెబ్ సిరీస్లనే చూసేశారు. 2024 జనవరి నుంచి జూన్ మధ్య ఎక్కువగా చూసిన సిరీస్లు/ సినిమాల లిస్టులో అమెజాన్ లో ఉన్న పంచాయత్ సీజన్ 3 (2.82 కోట్ల మంది) ఉంది. సాధారణంగానే ఈ సిరీస్ కు ఫ్యాన్ బేస్ ఎక్కువ అది మరోసారి రుజువైంది. ఇంక రెండో ప్లేస్ లో నెట్ ఫ్లిక్స్ లోని హీరామండి (2.30 కోట్ల మంది) ఉంది. మూడో స్థానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలోని ఇండియన్ పోలీస్ ఫోర్స్ (1.95 కోట్ల మంది) ఉంది.
- 4. కోట ఫ్యాక్టరీ సీజన్ 3- నెట్ ఫ్లిక్స్- 1.57 కోట్ల మంది చూశారు.
- 5. ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3, సీజన్ 4- హాట్ స్టార్ (1.48 కోట్ల మంది)
- 6. షో టైమ్- హాట్ స్టార్- 1.25 కోట్ల మంది
- 7. గుల్లక్ సీజన్ 4- సోనీ లివ్- 1.21 కోట్ల మంది
- 8. మహారాణి సీజన్ 3- సోనీ లివ్- 1.02 కోట్ల మంది
- 9. కిల్లర్ సూప్ – నెట్ ఫ్లిక్స్- 92 లక్షల మంది
- 10. జంనపార్- అమెజాన్ మినీ టీవీ- 92 లక్షల మంది
- 11. కర్మ కాలింగ్ – హాట్ స్టార్- 91 లక్షల మంది
- 12. రైసింఘని vs రైసింఘని- సోనీ లివ్- 85 లక్షల మంది
- 13. మామ్లా లీగర్ హై- నెట్ ఫ్లిక్స్- 81 లక్షల మంది
- 14. లూటెరే- హాట్ స్టార్- 80 లక్షల మంది
- 15. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్- హాట్ స్టార్- 80 లక్షల మంది
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.