AP Govt Pending Bills : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పెండింగ్ బిల్లులు, వివిధ పథకాల లబ్దిదారులకు గత ప్రభుత్వం చెల్లించని బకాయిల లెక్కలను అధికారులు తీస్తున్నారు. పెండింగ్ బిల్లులు, స్కీంలకు సంబంధించిన బకాయిల లెక్కలే ఒక లక్ష కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా వేశారు. 2014- 2019 మధ్య కాలంలో 30 వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని నాడు తెలుగు దేశం పార్టీపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఏకంగా రూ. 1 లక్ష కోట్లు పెండింగులో పెట్టడంపై ప్రభుత్వ పెద్దలు ఆశ్చర్యపోతున్నారు.
AP Govt Pending Bills
అలాగే, చిన్న పిల్లలకు ఇచ్చే చిక్కీలు, గుడ్లు, మధ్యాహ్న భోజన పథకం లాంటి పథకాలకు సంబంధించిన బిల్లులు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించని వైనం ఏర్పాడింది. ఒక్క ఇరిగేషన్ రంగంలోనే 20 వేల కోట్ల రూపాయలకు పైగా భారీగా పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 53 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులను గత ప్రభుత్వం పెట్టినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. చేసిన అప్పులు, పెండింగ్ బిల్లుల జాబితాను శాఖల వారీగా ఆర్థిక శాఖ సిద్దం చేస్తోంది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.