Saturday, November 23, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
Sri Lanka: జూలై 13న రాజీనామాకు సిద్ధమైన...

AP : November 2024 Session Department Tests

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబర్ 2024 సెక్షన్ సెషన్ లో...

APTET July 2024 Rsults out now. Check result on this direct link

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ జులై-2024) ఫలితాలను ఈ...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

How to check School Grant balance in PFMS login

Andhra Pradesh school education department sanctioned an amount of...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

Sri Lanka: జూలై 13న రాజీనామాకు సిద్ధమైన రాజపక్స హఠాత్తుగా పరారవడం వెనుక అసలుకారణం ఇదేనా?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఈ ఏడాది ప్రారంభం నుంచి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక పరిస్థితి రోజురోజుకూ మరింత ఆధ్వానంగా తయారవుతోంది.

sri lanka: జూలై 13న రాజీనామాకు సిద్ధమైన రాజపక్స హఠాత్తుగా పరారవడం వెనుక అసలుకారణం ఇదేనా?

Sri Lanka: జూలై 13న రాజీనామాకు సిద్ధమైన రాజపక్స హఠాత్తుగా పరారవడం వెనుక అసలుకారణం ఇదేనా?

Sri Lanka economic crisis:  తాజాగా ఆ దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్స అధ్యక్ష భవనం నుంచి పలాయనం చిత్తగించారు. సుదీర్ఘ కాలంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక దేశంలోని దాదాపు 22 మిలియన్ల మంది ప్రజలు గోటబయ రాజపక్స ప్యాలెస్‌లో నిరసనలు చేపట్టారు. ఓ వైపు ప్రజలు నిత్యావసరాల కోసం పెనుగులాట, మరోవైపు ఇంధనాన్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన లంక ప్రభుత్వంపై శనివారం మధ్యాహ్నం ఆగ్రహ జ్వాల మిన్నంటింది. రాజపక్స సోదరుడు మహింద రాజపక్స మేలో రాజీనామా చేసినప్పటికీ.. గత కొంత కాలంగా వస్తున్న రాజీనామా డిమాండ్లపై స్పందించని లంక అధ్యక్షుడు పారిపోయినట్లు మీడియా సంస్థలు ప్రకటించాయి.

భారీ నిరసనల మధ్య శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోసారి బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రకటించారు. అన్ని పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తున్నట్లు, అందుకు వీలుగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు విక్రమసింఘే ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అప్పటికే వీధుల్లోకి దుసుకొచ్చిన నిరసన కారులు ప్రధాని ప్రైవేట్ నివాస గృహానికి నిప్పంటించారు కూడా. ఇక అధ్యక్షుడు గోటబయ రాజపక్స కూడా జూలై 13న శాంతియుతంగా పదవీవిరమణ చేయనున్నాట్లు స్పీకర్‌ మహింద యాపా అబేవర్దన అధ్యక్షుడి తరపున శనివారం ప్రకటించారు. చట్టాన్ని గౌరవించి, శాంతిభద్రతలు కాపాడవల్సిందిగా లంక ప్రజలను స్పీకర్‌ కోరారు. ఐతే అనూహ్యంగా శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే రాజపక్స పరారయినట్లు వార్తలు గుప్పుమన్నాయి.

పవర్‌ఫుల్ పొలిటీషియన్స్‌గా పేరుగాంచి రాజపక్స సోదరులు శ్రీలంక ఆర్థిక సంక్షోభం మూలంగా నిందలు ఎదుర్కొన్నారు. 2009లో వేర్పాటువాద తిరుగుబాటుదారులను అణచివేసిన మహింద రాజపక్స హీరోగా మన్ననలు అందుకున్నాడు. ఆ సమయంలో మహింద రాజపక్స సోదరుడు డిఫెన్స్‌ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అనిశ్చిత పరిస్థితుల మధ్య ఆర్థిక సవాళ్లను లంక ఏ విధంగా ఎదుర్కొంటుదో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this