ప్రభుత్వ బీమా శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి, ఇబ్రహీంపట్నం, విజయవాడ
303 30. FIN 0 04-13/4/2022-GENERAL SEC-1699853, Dt:20/04/2022
విషయము: బీమా నిర్దేశాలయము సాధారణ విభాగము – ప్రీమియం (55) సంవత్సరముల వయస్సు కంటే ముందు నుండి రెగ్యులర్ గా తగ్గింపు చేయుచూ, 55 సంవత్సరముల దాటిన పిదప సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదించుట – సూచనలను జారీ చేయుట – గురించి.
నిర్దేశము : 1) G.O.Rt.No:90, Finance ( ADMIN-III, DI&IF) Dept, Dt: 18-04-2022
2) G.O.Ms.No:36, Finance ( ADMIN.DI&IF) Dept, Dt:05-03-2016
<<>>
APGLI Policy Bonds : 55 సంవత్సరముల దాటిన పిదప సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదించుట గురించి ఆదేశాలు
జిల్లా బీమాధికారుల దృష్టిని పై విషయమునకు తీసుకొనివస్తూ తెలియజేయునదేమనగా (55) సంవత్సరముల వయస్సు దాటక ముందు నుండి ప్రీమియం తగ్గింపు చేయుచూ (55) సంవత్సరములు పూర్తి అయినప్పటికి పాలసీ బాండ్లు తీసుకొనని వారికి ప్రస్తుతము సర్విస్ లో ఉండి ప్రీమియం రెగ్యులర్ గా తగ్గింపు చేయుచున్నచో, అట్టి ఉద్యోగుల ప్రతిపాదనలను సమర్పించి పాలసీలు పొందుటకు ప్రభుత్వము వారు తేదీ: 30-06-2022 వరకు అవకాశము కల్పిస్తూ ఉత్తర్వులు నిర్దేశము (1) జారీ చేయుట జరిగినది.
కావున జిల్లా బీమాధికారులు అందరూ ఈ క్రింద చర్యలు వెంటనే తీసుకోవలసినదిగా కోరడమైనది.
1. జిల్లా బీమాధికారులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము వారి జిల్లాలో ఉన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు, అందరి అహరణ మరియు బట్వాడా అధికారులకు వెంటనే లేఖ ద్వారా మరియు వారితో నేరుగా చర్చించి సదరు ప్రభుత్వ ఉత్తర్వులను తెలియజేయుచూ, వారు తగ్గించుకున్న ప్రీమియంలకు సత్వరమే ప్రతిపాదనలను సమర్పించి పాలసీ బాండ్లు పొందగలరని తెలియజేయవలసినదిగా కోరడమైనది.
2. ఈ సదుపాయము క్లెయిమ్ పరిష్కారం అయ్యిన పాలసీలకు వర్తించదు (చెల్లింపుతో సంబంధం లేదు.)
3. (55) సంవత్సరముల వయస్సు దాటక ముందు నుండి ప్రీమియం తగ్గింపు చేయుచూ (55) సంవత్సరములు పూర్తి అయినప్పటికి పాలసీ బాండ్లు తీసుకొనని వారికి ప్రస్తుతము సర్విస్ లో ఉండి ప్రీమియం రెగ్యులర్ గా తగ్గింపు చేయుచున్నచో వారికి మాత్రమే ఈ సదుపాయము.
4. ప్రస్తుతం అమలులో ఉన్న G.O.Ms.No:36, Finance ( ADMIN. DI&IF) Dept, తేది: 05-03-2016 ద్వారా మాత్రమే (60) సం. పదవి విరమణని పరిగణలోకి తీసుకొని పాలసీలు జారీ చేయగలరు. తదువరి (55) సం.ములు మరియు (58)నం. ముల పదవీ విరమణ వయస్సుని పరిగణలోకి వచ్చే పాలసీలు APGLI ఫండ్ రూల్స్ ప్రకారము ఇక నుండి జారీ చేయుట నిలివేయడమైనది.
5. PRC 2022 మరియు పెంచిన పదవి విరమణ వయస్సు(62 సం.) ప్రకారము సవరించిన కొత్త స్లాబ్ జారి 3000 5050 G.O.Ms.No:36,Finance (ADMIN. DI&IF) 20p2,274/05-03-2016 అమలు లో ఉంటుంది. తదుపరి నూతన స్లాబ్ రేట్స్ ఉత్తర్వులు వచ్చిన వెంటనే (60 సం.) పదవి విరమణ తో పాలవెలు జారీ చేయుట నిలిపివేయబడును. కాబట్టి తమ వద్ద ఉన్న ప్రస్తుత పెండింగ్ లో ఉన్న మొత్తం NB. ఫైలులను సత్వరమే పరిష్కారించవలసినదిగా ఆదేశించడమైంది..
6. ప్రతి జిల్లాలో స్థానిక దినపత్రికలలో కూడా ఉద్యోగుల సమాచార నిమిత్తము ఈ ప్రభుత్వ ఉత్తర్వుతో జత పరచిన ప్రకటనను జిల్లా పౌర సంబంధాల అధికారి ద్వారా ప్రకటనలు జారీ చేయగలరు. మీ కార్యాలయములో ఉద్యోగుల ప్రతిపాదనలు అందిన వెంటనే పాలసీ బాండ్లు జారీ చేయుటకు చర్యలు తీసుకోవలసినదిగా ఆదేశించడమైనది.
7. ప్రతి జిల్లా బీప కార్యాలయము నందు, కలెక్టరేట్ మరియు ట్రెజరీ కార్యాలయము నందు బ్యానర్లు ను ఈ క్రింద విధముగా ఏర్పాటు చేయగలరు.
(55) సంవత్సరము వయస్సు ముందు నుంచి APGLI ప్రీమియం కడుతూ (55) సంవత్సరములు లోపు పాలసీలు పొందని ఉద్యోగులకు ప్రభుత్వము వారు ఇచ్చిన అనుమతి ప్రకారము 30-06-2022 లోపు ప్రతిపాదన పత్రములను జిల్లా కార్యాలయములో సమర్పించి పాలసీలు పొందవలసినదిగా కొరటమైనది.
ఇట్లు,
జిల్లా బీమాధికారి,
ఎ.పి.జి.ఎల్.ఐ.
8. (55) సంవత్సరములు దాటిన ప్రతిపాదనలు ఎన్ని ప్రతిపాదనలు స్వీకరించినది. ఒక ప్రత్యేక రెజిస్టర్ నమోదు. చేస్తూ మరియు అట్టి ప్రతిపాదనలను ప్రాసెస్ చేసి ఎన్ని పాలసీలు జారీ చేసినది స్వీకృతి వివరములు ప్రతి నెల బీమా నిర్దేశాలయమునకు మాస నివేదికతో పాటు తప్పనిసరిగా తెలియజేయగలరు.
- సంఖ్య
- పాలసీ సంఖ్య suffix
- పాలసీదారుని పేరు
- నెలసరి బీమా
- బీమా మొత్తం
- ప్రోపోసల్ అందిన తేదీ
- పాలసీ జారీ చేసిన తేదీ
ఈ మేమో మీ కార్యాలయము నందు స్వీకరించగనే స్వీకృతి రశీదు పంపుచూ, ఈ విషయములో మీ కార్యాలయములో తీసుకున్న చర్యలను బీమా నిర్దేశాలయమునకు వెంటనే తెలియజేయగలరు.