దంతాలు చాలా మందిలో పటిష్టంగా ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రంగు మారుతుంటాయి. పసుపు పచ్చ (yellow)గా తయారవుతాయి. దీంతో నలుగురిలో హాయిగా నవ్వాలన్నా(smile) మొహమాటపడే పరిస్థితికి వస్తారు.
White teeth: దంతాలు తెల్లగా ఉండాలంటే ఈ పండ్లు తింటే మంచిది.. దంత సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్..?
దంతాలు(Teeth). ముఖంలో నవ్వు (Smile)ను ప్రతిబించించేవి. అయితే దంతాలు చాలా మందిలో పటిష్టంగా ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రంగు మారుతుంటాయి. పసుపు పచ్చ (yellow)గా తయారవుతాయి. దీంతో నలుగురిలో హాయిగా నవ్వాలన్నా(smile) మొహమాటపడే పరిస్థితికి వస్తారు. అయితే. అందుకే, ఎప్పుడూ పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు. రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్ల ( teeth white)గా మిలమిలలాడుతూ ఆరోగ్యంగా ఉంటాయి. అయితే మరికొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపు పచ్చగా కనబడుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీ దంతాలను తెల్ల ( Teeth white)గా మార్చుకోవచ్చు. మళ్లీ అందంగా ఎలాంటి బాధలు లేకుండా నవ్వుకోవచ్చు. అయితే ఆ చిట్కాలు (teeth white tips) ఏంటనేది ఇపుడు తెలుసుకుందాం..
స్టాంగ్ మౌత్ వాష్..
స్టాంగ్ మౌత్ వాష్ ను తయారుచేసుకోవాలి. బేకింగ్ సోడా మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ ను కప్పులో తీసుకొని నోట్లో పోసుకుని పుక్కలించి , శుభ్రం చేసుకోవాలి . దీన్ని రెగ్యులర్ గా చేయకూడదు. స్మోకింగ్ మానేయడం ( Stop Smoking) వల్ల దంతాలు తెల్లగా మారడం మాత్రమే కాదు , ఇది ఊపిరితిత్తులు మరియు హార్ట్ కు చాలా మంచిది
వారానికొసారి చేస్తే..
రెగ్యులర్ గా మీరు ఉపయోగించే టూత్ పేస్ట్ కి కొద్దిగా సోడా, టేబుల్ సాల్ట్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటివి జోడించాలి . ఈ మిశ్రమాన్ని ఉపయోగించి బ్రష్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వారానికొసారి చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది. ఆరెంజ్, నిమ్మ, బత్తాయి, బొప్పాయి, పైనాపిల్, జామ వంటి సిట్రస్ పండ్లలో ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది దంతాల మీద ఎనామిల్ ను తొలగిస్తుంది . అలాగని వీటిని తినకుండా మానేయడం కాదు. వీటిలో న్యూట్రీషియన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడంతో పాటు వీటిని తిన్న ప్రతి సారి మౌత్ వాష్ చేసుకోవడం తప్పనిసరి.
దంతాలను శుభ్రపరచడంలో, దంతాలు స్ట్రాంగ్ గా మార్చడంలో క్రంచీ వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ సహాయపడుతాయి . ఉదాహరణకు ఆపిల్స్, సెలరీ, క్యారెట్స్ ను అప్పుడప్పుడు తింటుండాలి . వీటిలో ఉండే అబ్రెస్సీవి స్ట్రక్చర్ దంతాలను రుద్దడం మరియు దంతాల మీద ఏర్పడ్డ ఎల్లో స్టెయిన్స్ తొలగించడానికి సహాయపడుతుంది . మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల నోట్లో పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu newStone does not confirm these. Please contact the relevant expert before implementing them.)