స్కూలు ఫీజు బాకీ ఉంటే క్లాస్‌లో అందరి ముందు లేపి నిలబెట్టి ప్రశ్నిస్తారా.. పరీక్షలు రాయకుండా వేచి ఉండేలా అవమానకరంగా మాట్లాడతారా.. ఫీజు కట్టమని పేరెంట్స్‌ను కదా అడగాలి.. మమ్మల్ని అడిగి అవమానకరంగా ఎందుకు మాట్లాడుతున్నారంటూ స్కూలు యాజమాన్యం, టీచర్లను ఇద్దరు విద్యార్దులు ప్రశ్నించారు..
AP: ఫీజు కట్టాలంటూ అందరి ముందు అవమానించారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారులు..
స్కూలు ఫీజు(School Fees) బాకీ ఉంటే క్లాస్‌లో అందరి ముందు లేపి నిలబెట్టి ప్రశ్నిస్తారా.. పరీక్షలు రాయకుండా వేచి ఉండేలా అవమానకరంగా మాట్లాడతారా.. ఫీజు కట్టమని పేరెంట్స్‌ను కదా అడగాలి.. మమ్మల్ని అడిగి అవమానకరంగా ఎందుకు మాట్లాడుతున్నారంటూ స్కూలు యాజమాన్యం, టీచర్లను ఇద్దరు విద్యార్దులు ప్రశ్నించారు.. అంతే కాకుండా తమను అందరి ముందు అవమానకరంగా మాట్లాడారంటూ తండ్రితో కలిసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు విద్యార్థులు. ఒంగోలులో ఈ సంఘటన చోటు చేసుకుంది. క్విస్ హైస్కూల్లో 8, 6వ తరగతి చదువుతున్న అన్నా చెల్లెళ్ళు స్కూలు యాజమాన్యం ప్రవర్తించిన తీరుకు ఇన్సల్ట్గా ఫీలయ్యిన ఈ చిన్నారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరే ఇతర విద్యార్దికి ఇలా జరగకుండా చూడాలని పోలీసులను కోరారు. అయితే ఈ ఘటనపై స్పందించేందుకు స్కూలు యాజమాన్యం ఇష్టపడటం లేదు.
అసలేం జరిగింది..
ఒంగోలులోని క్విస్ హైస్కూల్లో అన్నాచెల్లెల్లు రుత్విక్, మేఘనలు 8, 6వ తరగతి చదువుతున్నారు. 8వ తరగతి విద్యార్ది రుత్విక్ ఫీజు 38 వేలకు గాను 3 వేలు బాకీ ఉన్నారు. అలాగే చెల్లెలు మేఘన 6వ తరగతి ఫీజు 3 వేలు బాకీ ఉన్నారు. ఈ నేపథ్యంలో స్కూలు ఫీజు బాకీ ఉన్నారంటూ క్లాసులో అందరి ముందు తమను పేర్లు పెట్టి పిలవడమే కాకుండా నిలబెట్టి అవమానకరంగా మట్లాడుతున్నారంటూ ఈ ఇద్దరు చిన్నారులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇదే విషయాన్ని తమ తండ్రి శ్రీహరికి ఆవేదనతో చెప్పుకున్నారు. ఇదే మొదటిసారి కాకపోవడంతో విద్యార్దుల తండ్రి శ్రీహరి స్కూలు యాజమన్యాన్ని ప్రశ్నించారు. విద్యార్దులు ఫీజు బాకీ ఉంటే తల్లిదండ్రులను అడగాలి కానీ, ఇలా విద్యార్దులను పేరుపెట్టి పిలిచి పైకి లేపి అందరి ముందు క్లాసులో అవమానకరంగా మాట్లాడమేందని ప్రశ్నించారు.
అందరి ముందు దారుణంగా అవమానించారు- విద్యార్థులు
ఇలా అవమానకరంగా మాట్లాడిన టీచర్ని కూడా మీరు మాట్లాడకండి అంటూ పేరెంట్ అయిన తనను కూడా హేళనగా మాట్లాడటంతో తన పిల్లలతో పాటు తాను కూడా అవమానకరంగా ఫీలయ్యానని విద్యార్దుల తండ్రి శ్రీహరి ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇలా చాలా సార్లు స్కూలు యాజమాన్యం అవమానకరంగా మాట్టాడిన సందర్భాలు ఉండటంతో తమకు న్యాయం కావాలంటూ విద్యార్దులు తమ తండ్రిని వెంటబెట్టుకుని ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.
స్కూలు నుంచి నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వచ్చిన విద్యార్దులు అక్కడ ఉన్న పోలీసులకు తమ ఫిర్యాదు చేశారు. మరే ఇతర విద్యార్దికి ఇలాంటి అవమానం జరగొద్దని ఫిర్యాదు చేశారు. కేవలం ఫీజు బాకీ ఉన్నారన్న కారణంగా అవమానం జరగకుండా చూడాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.