Baby Oil for Hair: బేబీ ఆయిల్‌తో జుట్టు సమస్యలకు చెక్.. ఇలా చేస్తే బోలెడన్ని ప్రయోజనాలు..
జుట్టులో తేమ: బేబీ ఆయిల్‌ను జుట్టుకు పట్టించడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి జుట్టుకు తేమను అందిస్తుంది. ఈ తేమ చాలా కాలం పాటు ఉంటుంది. దీంతోపాటు జుట్టు కుదళ్లను బలంగా చేసి మరింత తేమను అందిస్తుందని పేర్కొంటున్నారు.
స్కాల్ప్ డ్రైనెస్ పోతుంది: స్కాల్ప్ పొడిబారడం వల్ల చుండ్రు వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే జుట్టు రాలడం కూడా మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో శిరోజాలు పొడిబారకుండా నిరోధించడానికి బేబీ ఆయిల్ ఉపయోగించండి.
బలమైన జుట్టు: బేబీ ఆయిల్లో ఉండే పదార్థాలు జుట్టును దృఢంగా మార్చుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వారానికి ఒకసారి బేబీ ఆయిల్‌తో జుట్టుకు మసాజ్ చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల జుట్టుకు మంచి పోషణ లభించి ఆరోగ్యంగా ఉంటుంది.
స్కాల్ప్ దురద: మీ తలలో దురద ఉంటే అది మిమ్మల్ని అనేక ఇతర జుట్టు సమస్యలకు గురి చేస్తుంది. దురద వల్ల నొప్పి, మంట కూడా వస్తుంది. తలస్నానం చేయడానికి ముందు మీ జుట్టుకు బేబీ ఆయిల్ రాయండి. కొంతసేపటి తర్వాత స్నానం చేయాలి.
ఎండ నుంచి రక్షణ: ఎండాకాలంలో మీరు ఎక్కువగా బయటకు వెళితే.. సూర్యకాంతి వల్ల మీ జుట్టు పాడైపోతుంది. ఈ స్థితిలో బేబీ ఆయిల్ సహాయం తీసుకోండి. ఈ నూనెను అప్లై చేసి బయటకు వెళ్లండి.. ఇది సూర్యరశ్మి, వేడి నుంచి జుట్టును కాపాడుతుంది.