దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (MSI) వాహనదారులను ఆకట్టుకునేందుకు న్యూ మోడల్స్ లాంచ్ చేస్తోంది. అలాగే పాత మోడల్స్ ని కొత్తగా తీర్చిదిద్ది వాహనదారులకు ఇంట్రడ్యూస్ చేస్తోంది.దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (MSI) వాహనదారులను ఆకట్టుకునేందుకు న్యూ మోడల్స్ లాంచ్ చేస్తోంది. అలాగే పాత మోడల్స్ ని కొత్తగా తీర్చిదిద్ది వాహనదారులకు ఇంట్రడ్యూస్ చేస్తోంది.
Maruti Suzuki: న్యూ ఎర్టిగా వెర్షన్ ను లాంఛ్ చేసిన మారుతి సుజుకి.. ధర, ప్రత్యేకతలివే..
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (MSI) వాహనదారులను ఆకట్టుకునేందుకు న్యూ మోడల్స్ లాంచ్ చేస్తోంది. అలాగే పాత మోడల్స్ ని కొత్తగా తీర్చిదిద్ది వాహనదారులకు ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఎర్టిగా (Ertiga) అనే మల్టీ పర్పస్ వెహికల్ (Multi Purpose Vehicle) కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ అప్ డేటెడ్ వెర్షన్‌ను రూ.8.35-12.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ మోడల్ కారు (Car) మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. అంతేకాదు, ఇది సీఎన్జీ ఆప్షన్ లో కూడా అందుబాటులో ఉంది. దీని మిగతా ఫీచర్లు ఏవో ఇప్పుడు చూద్దాం. హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చే ఈ వెహికల్ ప్యాడిల్ షిఫ్టర్లతో సరికొత్త అధునాతన సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో రన్ అవుతుంది. “పదేళ్ల క్రితం ఎర్టిగా లాంచ్ చేయడం భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది 4.7 శాతం CAGR (కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు) వద్ద పెరుగుతున్న కొత్త విభాగాన్ని సృష్టించింది” అని మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ హిసాషి టేకుచి పేర్కొన్నారు.
నెక్స్ట్ జనరేషన్ ఎర్టిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫీచర్స్, కొత్త ఇంజన్, సరికొత్త ట్రాన్స్‌మిషన్‌తో వస్తుందని ఆయన తెలిపారు. ఎర్టిగా లో క్రూయిజ్ కంట్రోల్, ఫాలో మీ హోమ్ ఫంక్షనాలిటీతో ఆటో హెడ్‌ల్యాంప్‌లు, S-CNG వేరియంట్లలో సీఎన్జీ స్పీడోమీటర్ అందించారు. కొత్త ఎర్టిగా పెట్రోల్ వెర్షన్ కారును రూ.18,600… సీఎన్జీ వెర్షన్ ను రూ.22,400 నెలవారీ సబ్స్క్రిప్షన్ ఫీజుతో మారుతి సుజుకి సబ్‌స్క్రైబ్ ద్వారా సొంతం చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. “కస్టమర్లకు ఫ్యూయల్- ఎఫిషియన్సీ, కంఫర్ట్, టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లను అందించే నెక్స్ట్-జెన్ ఎర్టిగా కచ్చితంగా భారతదేశం గో-టు ఎంపీవీ గా కొనసాగుతుంది. నెక్స్ట్ జనరేషన్ ఎర్టిగాని మా కస్టమర్లు ఆదరిస్తారు” అని టేకుచి సినిమా వ్యక్తం చేశారు.
పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్స్ రెండింటిలోనూ అందుబాటులో ఉన్న ఎర్టిగా 20.51 km/l (పెట్రోల్), 26.11km/kg (సీఎన్జీ) మైలేజీని అందిస్తుంది. ఎంపీవీ కార్ల సేల్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతూ వస్తున్నాయని MSI సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ & సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. అన్నారు. 2014-15లో ఈ ఎంపీవీ కారు విక్రయాల వృద్ధి 4-5 శాతం మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు అది పరిశ్రమలో 8-9 శాతానికి పెరిగింది. మారుతి సుజుకి ఇండియా కూడా తన మార్కెట్ వాటాను 33-34 శాతం నుంచి 61 శాతానికి పెంచగలిగింది. సుజుకి 2019 వరకు నెలకు 5,000 యూనిట్లు అమ్ముడయ్యేవి. ఐతే ఎర్టిగా, XL6 న్యూ వెర్షన్ ను విడుదల చేశాక నెలకు 13,500 యూనిట్లకు పెరిగింది.” అని శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.