Friday, September 20, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
White spots in nails: హఠాత్తుగా గోర్లమీద...

newStone Scripts and Projects and Tools

newStone Scripts and Projects and Tools created for teacher,...

newStone Latest News

newStone Latest News will fetch all latest posts in...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher : Supreme Court Reiterates

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

White spots in nails: హఠాత్తుగా గోర్లమీద తెల్ల మచ్చలు ఏర్పడ్డాయా.. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదంటున్న నిపుణులు

https://whatsapp.com/channel/0029VaAncF75q08iklatTd27 https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

White spots in nails: చేతి వేళ్ళ గోర్లు మన ఆరోగ్యానికి చిహ్నం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోళ్ళ ఆరోగ్యంగా ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నారని, గోళ్లు పెళుసుగా ఉంటే వారు తరచుగా జబ్బు పడుతుంటారని పలు అధ్యయనాలలో నిరూపితమైంది. అందుకనే గోర్లను చూసి వ్యక్తి యొక్క ఆరోగ్య సమస్యలను అంచనా వేస్తుంటారు వైద్యులు. అలాగని ఏ ఇద్దరు వ్యక్తుల గోర్లు ఒకేలా ఉండవు. అయితే కొంతమంది గోర్లమీద చిన్న చిన్న తెల్లని మచ్చలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఎక్కువగా నెయిల్ పాలిష్ ని ఉపయోగించేవారికి మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఈ మచ్చలు కొందరిలో సహజంగానే ఏర్పడతాయి. వీటిని వైద్య భాషలో ల్యూకోనైకియా అని అంటారు. ఇవి సహజసిద్ధంగా  ఏర్పడిన మచ్చలు. మరికొందరిలో హఠాత్తుగా కనిపిస్తాయి. ఇవి అనారోగ్య సమస్యల వలన ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా గోర్లమీద మచ్చలు ముందుగా మన శరీరంలోని కొన్ని అవయవాల పనితీరుపై అనుమానించాల్సిన అవసరం ఉందని.. అంటున్నారు. అవి ఏమిటో తెలుసుకుందాం..

* కొంతమంది గొర్లకు దెబ్బలు తగిలినా, ఫంగస్ వంటి ఇన్ ఫెక్షన్లు వచ్చినా గోర్లపై తెల్లమచ్చలు వచ్చే అవకాశం ఉంది.

*కొంతమందిలో జింక్, కాల్షియం లోపం ఉన్నా గోర్లమీద మచ్చలు ఏర్పడతాయి. అప్పుడు జింక్, కాల్షియం అధికంగా ఉన్న ఆహారపదార్ధాలు తీసుకుంటే మచ్చలు తగ్గుతాయి.

*కొంతమందిలో గోర్లమీద ఇలా మచ్చలు కనిపిస్తే.. దానికి కారణం గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటున్నారు.

*అంతేకాదు నోటి దుర్వాసన, న్యూమోనియా, సోరియాసిస్ వంటి వ్యాధులకు గుర్తు ఈ గోర్లమీద మచ్చలని వైద్యులు సూచిస్తున్నారు.

*గోర్లుమీద తెలుపు మచ్చలు కనిపిస్తే.. జీర్ణశయాంతర అంటు వ్యాధులు, అజీర్ణము, ఇతర అనారోగ్య లోపాలు సహా అనేక వ్యాధులకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

*ఒకొక్కసారి గోర్ల మీద మచ్చలు ప్రోటీన్ లోపంవలన కూడా ఏర్పడతాయి. జుట్టు ఊడిపోతుంది. రోగనిరోధక శక్తి రక్త తగ్గుతుంది. గోర్లు పెలుసుగా మారతాయి.

*కొంతమందిలో ఆర్సెనిక్ పాయిజ‌నింగ్ అయినా అలా గోర్లపై తెల్లని మ‌చ్చలు ఏర్పడతాయి.

అయితే ఇలా గోర్ల మీద మచ్చలు పెద్దగా.. ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిదని అంటున్నారు. తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని చెబుతున్నారు.

white spots in nails: హఠాత్తుగా గోర్లమీద తెల్ల మచ్చలు ఏర్పడ్డాయా.. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదంటున్న నిపుణులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this