Sunday, September 8, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
YSRCP Party Line on PRC Issue...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

newStone Scripts and Projects and Tools

newStone Scripts and Projects and Tools created for teacher,...

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher : Supreme Court Reiterates

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher...

AP Ganesh Mandapam Permission Application Process 2024

AP Ganesh Mandapam Permission Application Process వినాయక చవితి ఉత్సవాలకు...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

YSRCP Party Line on PRC Issue : పి.ఆర్.సి పై పార్టీ పరంగా అందరు నాయకులు ఉద్యోగులకు నచ్చ చెప్పవలసిన అంశాలతో వివరణ ఇచ్చుకున్న పార్టీ

https://whatsapp.com/channel/0029VaAncF75q08iklatTd27 https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en
వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం. తాడేపల్లి. – 20.01.2012.
వైయస్సార్‌సీపీ నాయకులు అందరి కోసం…

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు… ఈ నిజాలను మీ సమీపంలో ఉన్న ఉద్యోగులకు తెలియజేసేందుకు వీలుగా ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ఈ నోట్‌ను మీకు పంపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ విషయమై నిజాలను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఇచ్చిన 23 శాతం ఫిట్‌మెంట్‌ వల్ల ఉద్యోగుల జీతాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. ఇంతటి ఆర్థిక దుస్థితిలో కూడా ఇంత పెద్ద మనసు చేసుకుని ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ముఖ్యమంత్రిగారిని వ్యక్తిగతంగా దూషించడం భావ్యమేనా?.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, అయినా, వెనక్కు తగ్గని ముఖ్యమంత్రిగారి పెద్దమనసును, ఉద్యోగులకు ఈ 81 నెలల్లోనే ఎంత అండగా ఈ ప్రభుత్వం నిలబడిందన్న వాస్తవాలను తెలుపుతూ ఈ కింది నోట్‌ను మీకు పంపడం జరుగుతోంది.

ఐ.ఆర్‌.పై వక్రీకరణలు తగునా?

– ఐ.ఆర్‌. అంటే మధ్యంతర భృతి. ఒక ఉద్యోగికి ప్రభుత్వం మధ్యంతరంగా ఇచ్చే డబ్బు అని అర్థం. పీఆర్సీ ఇవ్వాలి కాబట్టి, ఆలోగా ఈ డబ్బును తీసుకోండి అని ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత ఈ డబ్బు పీఆర్సీ సర్దుబాటుకు లోబడే ఉంటుంది. గతంలో ఎప్పుడు ఐ.ఆర్‌. ఇచ్చినా, తర్వాత ప్రకటించిన పీఆర్సీని పరిగణలోకి తీసుకుని సర్దుబాటు చేసే జీతాలను ఖరారుచేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో నైనా ఇదే విధానాన్ని మొదటనుంచి అనురిస్తున్నారు. మన రాష్ట్రంలోకూడా అంతే.

– ఇది ఉద్యోగ సంఘాల నాయకులకు తెలిసీ.. ఐ.ఆర్‌.ను జీతంలో భాగంగా పరిగణిస్తూ వక్రీకరణ చేస్తున్నారు. ఉద్యోగులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారు.
– గమనించదగ్గ మరో విషయం ఏంటంటే… రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 27 శాతం ఐ.ఆర్‌. ఎప్పుడూ ఇవ్వలేదు.
– వైయస్‌.జగన్‌ సర్కార్‌ ఏర్పాటుకాగానే మొదటి 30 రోజుల్లోనే ఐఆర్‌ ప్రకటించారు.
– ఎవ్వరూ అడకపోయినా 2/శాతం ఐఆర్‌ మంజూరు చేశారు.
– ఉద్యోగులకు ఐ.ఆర్‌.కింద రూ.17,918 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించిన మాట వాస్తవం కాదా?

హెచ్‌ఆర్‌ఏ అన్నది జీతభత్యాల్లో ఒక అంశం కాదా?

– హెచ్‌ఆర్‌ఏ అన్నది మనకు అందుతున్న గ్రాస్‌ శాలరీలో ఒక సబ్‌ కాంపొనెంట్‌.
– ఇదే హెచ్‌ఆర్‌ఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఇస్తున్నారు.
– కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన రైల్వే, కేంద్రీయ విద్యాలయాల టీచర్లు, ఆల్‌ఇండియా ఆఫీసర్స్‌, పోస్టల్‌ ఉద్యోగులకూ ఇదే. హెచ్‌ఆర్‌ఏ వర్తిస్తోంది కదా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this