Tuesday, September 17, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
Mission Vatsalya Scheme Complete Details. 4000...

newStone Latest News

newStone Latest News will fetch all latest posts in...

newStone Scripts and Projects and Tools

newStone Scripts and Projects and Tools created for teacher,...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher : Supreme Court Reiterates

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

Mission Vatsalya Scheme Complete Details. 4000 Rupees Assistance to Children’s

https://whatsapp.com/channel/0029VaAncF75q08iklatTd27 https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Mission Vatsalya Scheme Complete Details. 4000 Rupees Assistance to Children’s

mission vatsalya scheme complete details. 4000 rupees assistance to children's


What’s New ??

Last Date Extended to April 30th, 2023

మిషన్ వాత్సల్య పథకం అంటే ఏమిటి ?

What Is Mission Vatsalya Scheme in Telugu ?

  • ఎవరైనా పిల్లలు 1 నుండి 18 సంవత్సరాల వయసు మధ్యగల పిల్లలకు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు లేని పిల్లల ఆర్థిక లేదా ఇతర అనగా పిల్లల వైద్య విద్య మరియు అభివృద్ధి అవసరాలు తీర్చడానికి కొంత సహాయం అందించడానికి కేంద్ర ప్రాయోజిత పథకం అయినటువంటి మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది.
  • ఇది కొన్ని షరతులతో కూడుకొని ఉంటుంది. ఈ స్పాన్సర్షిప్ ద్వారా పిల్లలకు నెలకు 4000 రూపాయలు అందించడం జరుగుతుంది.
  • ఈ పథకము కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.
  • ఒక కుటుంబం లో ఇద్దరు పిల్లల వరకు ధరకాస్తు చేసుకోవచ్చు.

మిషన్ వాత్సల్య పథకానికి ఎవరు అర్హులు?

Who Is Eligible For Mission Vatsalya Scheme ?

  • స్పాన్సర్ షిప్ కార్యక్రమము మంజూరు కొరకు నిరుపేద మరియు నిస్సహాయ స్థితిలో దిగువ తెలిపిన అర్హతలు కలిగిన 18 సంవత్సరాలు వయస్సు లోపు పిల్లలు అర్హులు
  • వితంతువు లేదా విడాకులు తీసుకున్న లేదా కుటుంబం వదిలివేసిన తల్లి యొక్క పిల్లలు
  • అనాధ మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న అనాధ బాలలు 
  • ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల యొక్క పిల్లలు
  • ఆర్ధికంగా, శారీరకంగా పిల్లలను పెంచలేని నిస్సహాయ తల్లిదండ్రులు పిల్లలు
  • బాల న్యాయ (రక్షణ & ఆదరణ) చట్టం -2015 ప్రకారం రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లలు- ఇల్లు లేని బాలలు, ప్రకృతి వైపరీత్యాలకు గురి అయిన బాలలు, బాల కార్మికులు, బాల్య వివాహ బాధిత బాలలు, హెచ్. ఐ. వి/ఎయిడ్స్ బాధిత బాలలు, అక్రమ రవాణాకు గురి అయిన బాలలు, అంగ వైకల్యం ఉన్న బాలలు, తప్పిపోయిన మరియు పారపోయిన బాలలు, వీధి బాలలు, బాల యాచకులు, హింసకు/వేదింపులకు/దుర్వినియోగం/ దోపిడీలకు గురి అయిన బాలలు, సహాయం మరియు ఆశ్రయం కావలసిన బాలలు.
  • PM CARE FOR CHILDREN మంజూరైన బాలలు
  • తండ్రి మరణించిన అనగా తల్లి వితంతువుగా ఉన్న లేదా విడాకులు తీసుకున్న (కోర్టు నుండి పొందిన ఆదేశాలు ఉండాలి లేదా గ్రామ పెద్దల సమక్షంలో రాసుకున్న ఒప్పంద పత్రం తో ధరకాస్తు చెయ్యొచ్చు కానీ కమిటీ నిర్ణయమే ఫైనల్ ) లేదా కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు.
  • పిల్లలకు తల్లి మరియు తండ్రి ఇద్దరు మరణించి అనాధలుగా ఉండి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న వారు.
  • తల్లిదండ్రులు ప్రాణాపాయ లేదా ప్రాణాంతక వ్యాధికి గురైన వారు
  • బాల కార్మికులుగా గుర్తించబడిన పిల్లలు, కుటుంబంతో లేని పిల్లలు, అంగవైకల్యం కలిగిన పిల్లలు, ఇంటి నుండి పారిపోయి వచ్చిన పిల్లలు, బాల యాచకులు, ఏదైనా ప్రకృతి వైపరీత్యానికి గురైన పిల్లలు, వీధులలో నివసిస్తున్నటువంటి పిల్లలు, దోపిడీకి గురైన పిల్లలు (JJ Act,2015 ప్రకారం).
  • కోవిడ్ 19 అనగా కరోనా వలన తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఎవరైతే పీఎంకేర్స్ పథకం కింద నమోదు అయిన అటువంటి పిల్లలు.

మిషన్ వత్స్యల్య స్పాన్సర్షిప్  ఆర్ధిక పరిమితి ఏంటి ?

What is Mission Vatsalya Scheme Icome Criteria ? 

  • రెసిడెన్సియల్ స్కూల్ నందు చదువుతున్న బాలలకు ఈ పథకం వర్తించదు.
  • ఈ పథకానికి అర్హులైన పిల్లలకు గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ సంస్థ ఆదాయం రూ.72,000 కి మించి ఉండరాదు.
  • అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో కుటుంబ సంస్థ ఆదాయం రూ.96,000 నుంచి ఉండరాదు.

‘మిషన్ వాత్సల్య’ నిధుల కేటాయింపు ఎలా ?

What Is Mission Vatsalya Budget ?

ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం 60 శాతం అంటే రూ. 2400 కాగా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం రూ.1600 నిధులు సమకూర్చి అనాథ పిల్లలకు అందజేయనున్నారు.ఈ పథకం నిస్స హాయ స్థితిలో ఉన్న కుటుంబాల పిల్లల సంరక్షణతో పాటు వారి చదువును కొన సాగించేందుకు దోహదపడుతుంది.

మిషన్ వత్స్యల్య స్పాన్సర్షిప్ కాలపరిమితి ఏమిటి ?

What is Time Limit of Mission Vatsalya Scheme ?

  • స్పాన్సర్ షిప్ కార్యక్రమం 18 సంవత్సరములు వయస్సు నిండే వరకు లేదా మిషన వాత్సల్య పథకం ముగింపు వరకు బాలలు కుటుంబాన్ని విడిచిపెట్టి ఇన్స్టిట్యూషన్ (సి.సి.ఐ)లో చేరినపుడు ఈ స్పాన్సర్ షిప్ ఆర్ధిక సహాయం నిలుపుదల చేయబడుతుంది.
  • పిల్లలు 30 రోజులకు మించి స్కూలుకు హాజరు కానియెడల సదరు స్పాన్సర్ షిప్ నిలుపుదల చేయబడును. (ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మినహాయింపు కలదు)
  • ఈ పథకానికి అర్హులైన పిల్లలు భవిష్యత్తులో ఏదైనా హాస్టల్స్ లో జాయిన్ అయితే అక్కడ నుంచి పథకం నిలుపుదల చేస్తారు.
  • ఈ స్పాన్సర్షిప్ కమిటీ వారు ప్రతి సంవత్సరము ఈ పథకాన్ని సమీక్షించి స్పాన్సర్షిప్ ను నిలిపివేయవచ్చు లేదా కొనసాగించవచ్చు.
  • తల్లి చనిపోయి తండ్రి వేరే వివాహం చేసుకుంటే అటువంటి పిల్లలకు ఈ పథకం రాదు ఎందువలన అంటే తండ్రి మరియు పిన తల్లి వున్నట్టు కాబట్టి.
  • పిల్లల స్టడీ certificate ఈ సంవత్సరం అనగా 2022-2023 మాత్రమే సమర్పించండి.

మిషన్ వాత్సల్యకు దరఖాస్తు కావాల్సిన డాక్యుమెంట్ లు ఏమిటి ? 

Required Documents For Vatsalya Scheme ?

  • బాలుడి లేదా బాలిక జనన ధ్రువీకరణ పత్రం
  • బాలుడి లేదా బాలిక ఆధార్ కార్డు
  • తల్లి ఆధార్ కార్డు
  • తండ్రి ఆధార్ కార్డు
  • తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రము, మరణ కారణము
  • గార్డియన్ ఆధార్ కార్డు
  • రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డు
  • కుల ధ్రువీకరణ పత్రము
  • బాలుడి లేదా బాలిక పాస్ ఫోటో
  • స్టడీ సర్టిఫికేట్
  • ఆదాయ ధ్రువీకరణ పత్రము

బాలుడి లేదా బాలిక వ్యక్తిగత బ్యాంక్ ఎకౌంటు లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులతో కలిసిన జాయింట్ అకౌంట్.

పైన తెలిపిన పత్రాలతో పాటు దరఖాస్తును మీకు సంబంధించిన సి.డి.పి.ఓ కార్యాలయానికి గడువు లోపల అందించగలరు.

Mission Vatsalya Scheme Application  👇 

[post_ads]

Click Here to Download Application

మిషన్ వాత్సల్యకు ఎంపిక పద్దతి ? 

Vatsalya Scheme Selection Process ?

గడువులోగా CDPO కార్యాలయానికి అందిన దరఖాస్తులు అన్నింటిని మండల స్థాయిలో స్క్రూట్ ని కమిటీ వారు నిశితంగా పరిశీలిస్తారు వాటిలో అర్హత కలిగిన వారిని ఎంపిక చేస్తారు అక్కడ నుండి సభ్యుల సంతకాలతో కూడిన దరఖాస్తులు అన్నింటిని జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారత అధికారి వారి కార్యాలయానికి పంపిస్తారు.అక్కడ నుండి జిల్లా కలెక్టర్ గారి ఆమోదానికి పంపిస్తారు.

మిషన్ వాత్సల్య దరఖాస్తు నింపే తప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Important Instructions While Filling Mission Vatsalya Scheme Applicaion 

  • మొదటి నాలుగు కాలంలలో చిరునామా నింపవలెను.
  • తదుపరి పిల్లల వివరాలు నింపేటప్పుడు పిల్లల పేర్లు విడివిడి అక్షరాలలో క్యాపిటల్ లెటర్స్ లో రాయండి.
  • తండ్రి మరణించిన లేక బతికున్న సరే తండ్రి పేరు ఖచ్చితంగా రాయవలెను.
  • తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయేటప్పుడు గార్డియన్ పేరు వద్ద గార్డియన్ ఎవరైతే ఉన్నారో వారి పేరు మరియు వారి ఆధార్ నెంబరు రాయాలి.
  • పిల్లల జనన ధ్రువీకరణ పత్రానికి సంబంధించి గ్రామపంచాయతీ కార్యాలయము లేదా మున్సిపల్ కార్యాలయం నుండి పొందినది లేదా స్కూలు నుండి పొందిన సర్టిఫికెట్స్ ను సమర్పించవచ్చు.
  • పిల్లల బ్యాంకు వివరాలు ఏదైనా నేషనల్ బ్యాంక్ నుండి తీసుకుంటే మంచిది.
  • మరిన్ని పూర్తి వివరాలకు అంగన్వాడీ కార్యకర్తలు లేదా సచివాలయం లో మహిళ పోలీసు వారిని సంప్రదించండి.

మిషన్ వాత్సల్య పథకం – శ్రీకాకుళం ఆర్డర్ కాపీ 👇🏿

Click Here to Download

మిషన్ వాత్సల్యకు  సంబంధించిన ప్రశ్నలు మరియు జవాబులు 
Vatsalya Scheme FAQ 

Q1.ఈ పథకానికి చివరి తేదీ ఎప్పుడు?

-April 30th

Q2.ఈ పథకానికి అర్హులైన పిల్లలకు గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ సంస్థ ఆదాయం ఎంత ఉండాలి?

-రూ.72,000 కి మించి ఉండరాదు.

Q3.పట్టణ ప్రాంతాలలో కుటుంబ సంస్థ ఆదాయం ఎంత ఉండాలి?

-రూ.96,000 నుంచి ఉండరాదు.

Q4.ఈ పథకం ద్వారా పిల్లలు ఎంత లబ్ధి పొందుతారు?

– ఈ స్పాన్సర్షిప్ ద్వారా పిల్లలకు నెలకు 4000 రూపాయలు అందించడం జరుగుతుంది.

Q5.ఈ పథకానికి ఎవరు అర్హులు?

  • తండ్రి మరణించిన అనగా తల్లి వితంతువుగా ఉన్న లేదా విడాకులు తీసుకున్న (కోర్టు నుండి పొందిన ఆదేశాలు ఉండాలి లేదా గ్రామ పెద్దల సమక్షంలో రాసుకున్న ఒప్పంద పత్రం తో ధరకాస్తు చెయ్యొచ్చు కానీ కమిటీ నిర్ణయమే ఫైనల్ ) లేదా కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు.
  • పిల్లలకు తల్లి మరియు తండ్రి ఇద్దరు మరణించి అనాధలుగా ఉండి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న వారు.
  • తల్లిదండ్రులు ప్రాణాపాయ లేదా ప్రాణాంతక వ్యాధికి గురైన వారు
  • బాల కార్మికులుగా గుర్తించబడిన పిల్లలు, కుటుంబంతో లేని పిల్లలు, అంగవైకల్యం కలిగిన పిల్లలు, ఇంటి నుండి పారిపోయి వచ్చిన పిల్లలు, బాల యాచకులు, ఏదైనా ప్రకృతి వైపరీత్యానికి గురైన పిల్లలు, వీధులలో నివసిస్తున్నటువంటి పిల్లలు, దోపిడీకి గురైన పిల్లలు (JJ Act,2015 ప్రకారం).

Q6.ఈ పథకాన్ని స్పాన్సర్స్ షిప్ కమిటీ వాళ్ళు జీవితాంతం ఇస్తారా?

-ఈ స్పాన్సర్షిప్ కమిటీ వారు ప్రతి సంవత్సరము ఈ పథకాన్ని సమీక్షించి స్పాన్సర్షిప్ ను నిలిపివేయవచ్చు లేదా కొనసాగించవచ్చు.

Q7.తల్లి చనిపోయి తండ్రి వేరే వివాహం చేసుకుంటే అటువంటి పిల్లలకు ఈ పథకం వస్తుందా?

-తల్లి చనిపోయి తండ్రి వేరే వివాహం చేసుకుంటే అటువంటి పిల్లలకు ఈ పథకం రాదు ఎందువలన అంటే తండ్రి మరియు పిన తల్లి వున్నట్టు కాబట్టి.

Q8.ఈ పథకం కు ఎంపికైన వారు ప్రతి రోజు బడికి వెళ్ళకపోతే ఏమవుతుంది?

– పాఠశాలకు వెళ్లే విద్యార్థులు హాజరు వరుస 30 రోజులకు పైబడి సక్రమంగా లేనియెడల ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తారు. అయితే ప్రత్యేక అవసరాలు గలిగిన బాల బాలికలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది.

Mission Vatsalya Scheme pdf 👇

Click Here to Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this