Paris Olympics 2024 : పారిస్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ 2024కు అంతా సిద్ధమైంది. మరో ఆరు రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్స్ క్రీడలు కొనసాగనున్నాయి. అయితే.. ఈ సారి ఒలింపిక్స్ ఆరంభ వేడుకలను కాస్త భిన్నంగా చేయనున్నారు. ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీని సెన్ నదిపై నిర్వహించనున్నారు. కాగా.. ఆరంభ వేడుకలు స్టేడియంలో కాకుండా ఆరు బయట నదిలో జరగడం ఇదే తొలిసారి కానుంది.
ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల కోసం నివాసం కల్పించే ఒలింపిక్ విలేజ్‌లో సైతం భిన్నమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అథ్లెట్లు శృంగారంలో పాల్గొనకుండా ఉండేలా.. యాంటీ సెక్స్ బెడ్స్ సిద్ధం చేశారు. కాగా..ఈ బెడ్‌ల పరిణామం చాలా చిన్నవిగా ఉన్నాయి. అదే సమయంలో 3లక్షల కండోమ్‌లను అందుబాటులో ఉంచనున్నట్లు నిర్వాహకులు తెలపడం గమనార్హం.
కరోనా మహమ్మారి కారణంగా 2020లో టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో సాన్నిహిత్యం పై నిషేదం విధించారు. అత్యంత కఠిన నిబంధనల మధ్యనే టోక్యో ఒలింపిక్స్‌ను నిర్వహించారు. కాగా.. ఈ సారి దాదాపుగా అన్ని ఆంక్షలు ఎత్తి వేశారు. అయినప్పటికీ కూడా పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు ఇద్దరు వ్యక్తులు కౌగిలించుకుని పడుకోవడానికి వీలు లేకుండా బెడ్‌లను తయారు చేయించారు. అంతేకాదండోయ్.. ఈ బెడ్‌లను సెక్స్ నిరోధించే పదార్థాలతో తయారు చేయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ బెడ్‌లను జపనీస్ కంపెనీ ఎయిర్‌వేవ్ తయారు చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఈ కంపెనీ బెడ్‌లనే వాడారు.
ఒలింపిక్స్ విలేజ్‌లో శృంగారం గురించి ఎన్నో దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా 2000 సంవత్సరంలో నిర్వహించిన ఒలింపిక్స్ సమయంలో 70 వేల కండోమ్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. అయితే.. అవి సరిపోకపోవడంతో రెండో సారి 20 వేల కండోమ్‌లను ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తరువాత నుంచి నిర్వహిస్తున్న ఒలింపిక్స్‌లో లక్ష కండోమ్‌లను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుత ఒలింపిక్స్‌లో 3 లక్షల కండోమ్‌లను ఉంచనున్నారు.
ఇక ఈ వార్తలు వైరల్‌గా మారగా.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.